![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -440 లో..... ప్రేమ కాఫీ పెడుతుంది. అందరికి అమూల్య ఇస్తుంది. అమూల్య సేమ్ అమ్మలాగే పెట్టావ్ చాలా బాగుందని ధీరజ్ అంటాడు. అది నేను పెట్టలేదు వదిన పెట్టిందని అమూల్య అనగానే.. అవునా ఛీఛీ కాఫీ బాలేదని అంటాడు. నోరు మూసుకొని తాగు కాఫీ చాలా బాగుందని రామరాజు అంటాడు. సాగర్ ని కాఫీ తాగమని తిరుపతి పిలుస్తాడు. నేను వచ్చి అక్కడ కాఫీ తాగితే ఆయన గారు వెళ్ళిపోతారని రామరాజుని ఉద్దేశ్శించి సాగర్ కోపంగా అంటాడు. ఆ తర్వాత ఒరేయ్ పెద్దోడా వల్లి లేకపోతే ఇల్లంతా బోసిగా ఉంది వెళ్లి తీసుకొని రా అని రామరాజు అంటాడు. తను లేకపోతే ఇంట్లో వెలుగు లేనట్లే అంటున్నారు ఏంటి నాన్న.. అసలు వల్లి గురించి తెలిస్తే అని చందు చెప్పబోతుంటే అప్పుడే ప్రేమ వద్దని సైగ చేస్తుంది.
ఆ తర్వాత తనకి రావాలి అనుకున్నప్పుడు వస్తుందని చందు చెప్పేసి వెళ్తాడు. అంటే వాడి ఉద్దేశ్యం తన భార్య లేకపోతే ఇంట్లో పనులు చేసుకోలేరా అని అంటున్నాడని ధీరజ్ కవర్ చేస్తాడు. ప్రేమ నువ్వే ఇంట్లో పనులన్నీ చెయ్యాలి.. వల్లి వదిన వచ్చేవరకు అన్నీ నువ్వే చూసుకోవాలని ధీరజ్ చెప్పగానే ప్రేమ కోపంగా చూస్తుంది. మరొకవైపు భాగ్యం డబ్బు ఇచ్చిన రౌడీ సేనాపతి దగ్గర పని చేస్తాడు. రౌడీకీ మేనేజర్ కి గొడవ జరుగుతుంది. అప్పుడే సేనాపతి వెళ్లి మాట్లాడతాడు. ఇక రౌడీ ఫోన్ జేబులో నుండి తీస్తుంటే.. జేబులో నుండి చందు ఫోటో కిందపడుతుంది. ఏంటని ఆరా తీస్తాడు సేనాపతి. భాగ్యం వాళ్ళు డమ్మీ ఆక్సిడెంట్ చేయమన్నారనే విషయం తెలుసుకొని దాన్ని తనకి నచ్చినట్టుగా మార్చుకోవాలని అనుకుంటాడు సేనాపతి. దాంతో డమ్మీ కాదు నిజంగానే చెయ్.. వాళ్ళు అయిదు వేలు ఇస్తానని అన్నారు కదా నేను అయిదు లక్షల డబ్బు ఇస్తానని రౌడీతో సేనాపతి అనగానే సరేనని చెప్తాడు రౌడీ.ఆ తర్వాత ప్రేమ గదిలోకి కాఫీ తీసుకొని వెళ్తుంది. ఇక కావాలనే ధీరజ్ ని ఊరిస్తూ తాగుతుంది ప్రేమ. దాంతో ధీరజ్ చిరాకుపడి వెళ్ళిపోతాడు. ప్రేమ హాల్లో ఉంటుంది. అప్పుడే చందు వచ్చి ఏంటని అడుగుతాడు. కాలేజీ లో డ్రాప్ చేయమని అంటే వదిలేసి వెళ్ళిపోయాడని ప్రేమ అనగానే సరే నేను డ్రాప్ చేస్తానని చందు అంటాడు.
మరొక వైపు చందు, ప్రేమ బయల్దేరతారు. వాళ్ళు వచ్చే దారిలో ఆనందరావు మేకులు వేస్తాడు. దూరం నుండి వల్లి ఆనందరావు, భాగ్యం వాళ్ళు చూస్తుంటారు. అప్పుడే ప్రేమని తీసుకొని చందు వస్తాడు. మేకులు గుచ్చుకొని టైర్ పంచెర్ అవుతుంది. దాంతో ధీరజ్ కి చందు ఫోన్ చేసి ప్రేమని తీసుకొని వెళ్ళమని అంటాడు. దూరం నుండి రౌడీ లారీ నడుపుకుంటూ వస్తాడు. స్పీడ్ గా వస్తుంటే శ్రీవల్లి చూసి భయపడుతుంది. అమ్మా నిజంగానే ఆక్సిడెంట్ చేస్తాడేమో అని టెన్షన్ పడుతుంది. భాగ్యం రౌడీకి ఫోన్ చేస్తుంది. మరొకవైపు చందు దగ్గర వరకు లారీ వస్తుంటే బావ అని ప్రేమ తనని పక్కకి నెట్టేస్తుంది. దాంతో ప్రేమకి ఆక్సిడెంట్ అవుతుంది. ప్రేమ అని ధీరజ్ గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |